దేశంలో కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. గత రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో 15,528 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం దేశంలో మొత్తం 1,43,654 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.32 శాతానికి తగ్గినట్లు తెలియజేశారు.
