ఎప్పుడు వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్ తగిలింది. వర్మ రూపొందించిన లడ్కీ సినిమా ప్రదర్శనపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు నాయస్థానాన్ని ఆశ్రయించాడు.
తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటున్నాడని వివరించాడు. విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.