తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో.. స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ కు అరుదైన ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఆగస్టు 21న న్యూయార్క్ లో జరగనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడికి ఆయనకు ఇన్విటేషన్ అందింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రకటించింది. భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ ఇండియా డే పరేడ్ నిర్వహించనున్నారు.
