వరుస సినిమాలను తీయడమే కాకుండా హిట్ల మీద హిట్లు కొడుతూ మంచి ఊపు మీదున్న స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ విడుదల అయింది..దీనికి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి ఊహించని భారీ రెస్పాన్స్ వస్తోంది.
ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ పొందింది.. హీరో రవితేజకు సంబంధించి తన కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రయిలర్ గా ఈ మూవీ నిలిచింది. ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.. శరత్ మండవ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈనెల జూలై 29న రిలీజ్ కానుంది.