తెలుగు హిందీ అనే ఏ సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పలు భాషల్లో విభిన్న సినిమాలు చేసిన హాటేస్ట్ బక్కపలచు భామ.. అలనాటి అందాల నటి ఇలియానా .. యంగ్ అండ్ ఎనర్జిటిక్ యువహీరో రామ్ హీరోగా వచ్చిన ‘దేవదాస్’, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘పోకిరి’, మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘కిక్’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ .ఆ తర్వాత నార్త్ లోకి బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడింది ఈ బక్కపలచు పొడగరి సుందరి.
ఇలియానా తాజాగా వార్తల్లో నిలిచింది. అందుకు కారణమేంటంటే.. ఓ స్టార్ హీరోయిన్ సోదరుడితో ఆమె డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ యొక్క సోదరుడు సెబాస్టియన్ తో ఇలియానా సహజీవనం చేస్తుందని వదంతులు అక్కడ హల్ చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో కత్రినా కైఫ్ జులై 16న పుట్టిన రోజును మాల్దీవుల్లో ఘనంగా జరుపుకొంది. ఈ వేడుకల్లో కత్రినా భర్త విక్కీ కౌశల్ , సన్నీ కౌశల్, శర్వరీ వఘ్, ఇలియానా డి క్రూజ్, సెబాస్టియన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలియానా అందరితో కలసి ఫొటో తీసుకుంది. ఈ పిక్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘సూర్యోదయం, కాక్ టెయిల్స్, కొంచెం బర్త్ డే కేక్’ అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే కత్రినా సోదరుడితో ఇలియానా డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు కొట్టడం ప్రారంభమయ్యాయి.చూడాలి మరి ఈ వార్తల్లో నిజమేంతో..?