తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
