గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. వరదల కారణంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందని.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను, అన్నదాతలను ఆదుకునేలా రాష్ట్రానికి సాయం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .
