ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన దాదాపు 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఉచితంగా అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి విడదల రజని చెప్పారు. రోజుకు 15 లక్షల మందికి చొప్పున టీకా వేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మొత్తం 45 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్నారు. పీహెచ్సీలు, సచివాలయాలు, రైల్వేస్టేషన్లు, కాలేజీలు, స్కూళ్లు, బస్టేషన్లు, పారిశ్రామిక వాడల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుందన్నారు.
