అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అని ట్రంప్ ట్వీట్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొనలేదు.
1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటి మార్గాను ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. 1999లో ఆమెను వదిలేసి, 2005లో మెలానియా ట్రంపు పెళ్లాడారు.