దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,038 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు కరోనా వైరస్ మహమ్మారి కోలుకున్నారు.
ఇప్పటివరకు 5,25,604 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,39,073 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొన్నిరోజులుగా భారీగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు 5 నెలల తర్వాత మొదటిసారిగా గురువారం 20 వేలు దాటిన విషయం మనకు తెలిసిందే.గత 24 గంటల్లో 47 మంది కరోనాకు బలయ్యారని, 16,994 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది