భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద నదిలో చిక్కుకున్న ఇద్దరు మేకల కాపరులను హెలికాప్టర్ ద్వారా సుక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మేకల కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తడంతో నదిలో చిక్కుకున్నారు.
అక్కడ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. వరద పెరిగిపోవడంతో వారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు స్థానికులు తెలపడంతో ఆయన మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్ వెంటనే అధికారులతో మాట్లాడి హెలికాప్టర్‌ను ఘటనాస్థలానికి పంపించి వారిని కాపాడారు.