శ్రీలంకలో ప్రజల ఆందోళన రోజురోజుకీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు.. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపైనా దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ప్రధాని.. అక్కడి సైనిక దళాల అధిపతులతో చర్చించారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించాలని నిర్ణయించారు. గొటబాయ రాజపక్స పరారవ్వడంతో తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన చేశారు. నిరసనకారులు బయట కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.