తనకు హార్ట్ఎటాక్ వచ్చిందంటూ వచ్చిన వార్తలన్నింటినీ చూశానని ప్రముఖ నటుడు విక్రమ్ అన్నారు. ఇటీవల విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని.. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో నిర్వహించిన ‘కోబ్రా’ మూవీ ఆడియో ఫంక్షన్లో ఆయన స్పందించారు.
జబ్బు పడిన వ్యక్తి ఫొటోలకు నా తలను పెట్టి మార్ఫింగ్ చేశారని.. ఫొటోపై నా పేరు పెట్టి థంబ్‌నెయిల్స్‌తో ప్రచారం చేశారన్నారు. వాళ్ల క్రియేటివిటీ బాగుందన్నారు. తన జీవితంలో ఇలాంటివి ఎన్నో అనుభవించానని చెప్పారు. ఇదేమీ తనను పెద్దగా ఆందోళనకు గురిచేయలేదన్నారు. ఈ విషయంలో తనకు కుటుంబం, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అండగా ఉన్నారని.. ఇంతకుమించి జీవితంలో తనకేమీ వద్దన్నారు విక్రమ్.