ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న ప్రస్తుత భద్రతను ఉపసంహరించుకుంది.
భద్రతలో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న గన్‌మెన్లు వెనక్కి రావాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేల ఫోన్లను వైసీపీ ట్యాపింగ్ చేస్తున్నారని ఇటీవల ఎమ్మెల్యే కేశవ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో పెగాసస్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రభుత్వ వేసిన కమిటీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పకొడుతున్న కేశవ్‌పై ప్రభుత్వం కక్షగట్టిందని టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపించారు.