టీమిండియా సారథిగా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్ పడింది. టీమిండియా కెప్టెన్ గా 19 వరుస విజయాల తర్వాత నిన్న ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అఖరి టీ20లో టీమిండియా ఓడిపోయింది.
దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ (వరుసగా 20 విజయాలు) రికార్డు పదిలంగా ఉండిపోయింది. హిట్మ్యాన్ సారథ్యంలో భారత్ వరుసగా 14 టీ20లు గెలిచింది. న్యూజిలాండ్ (టీ20), వెస్టిండీస్ (వన్డే, టీ20), శ్రీలంక (టెస్టు, టీ20) సిరీస్లు క్లీన్ స్వీప్ చేయగా, తాజాగా 2-1 తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై గెలిచింది.