భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్‌ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సెక్రటేరియట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది.