శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. అధ్యక్ష భవనంపై దాడి చేసిన ఆందోళనకారుల్లో కొంతమంది అక్కడే తిష్ట వేశారు. రాజీనామా చేస్తానన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసేంతవరకు అక్కడి నుంచి కదలబోమని తేల్చి చెబుతున్నారు.
అధ్యక్షుడితో పాటు ప్రధాని అధికారిక నివాసాల్లోకి వెళ్లిన ఆందోళనకారులు.. అక్కడి ప్రతి గదినీ పరిశీలించారు. అధ్యక్షుడు, ప్రధాని ఉపయోగించిన వస్తువులను వాడేశారు. కుటుంబసభ్యులు, పిల్లలతో అక్కడికి చేరుకున్నారు. అక్కడే తిరుగుతూ భోజనాలు కూడా చేశారు.
స్మిమ్మింగ్ ఫూల్స్లో జలకాలాడుతూ.. సోఫాల్లో కూర్చొంటూ.. టీవీలు చూస్తూ.. జిమ్లో ఎక్సర్సైజులు చేస్తూ గడిపారు. కొందరైతే అధ్యక్షుడి బాత్రూంలోనే స్నానాలు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
`