తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హాటెస్ట్ భామ శృతి హసన్ హీరోయిన్ గా ..సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో నటించగా కరోనా మహమ్మారి హాయంలో వచ్చిన క్రాక్ మూవీ భారీ విజయం అందుకున్న సంగతి విదితమే . ఈ మూవీపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
“తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన “సేతుపతి” హక్కులను నేను కొనుగోలు చేశాను. అదే సినిమాను “క్రాక్” పేరుతో డైరెక్టర్ గోపీచంద్ కాపీ చేశాడు. విలన్ పాత్ర మార్పులు చేసి నాకే వినిపించాడు. అతడు సినిమా చేయడానికి ఆసక్తిగా ఉండటంతో ‘సేతుపతి’ హక్కులను గోపీచంద్కు ఇచ్చేశాను” అని చెప్పాడు.