ఇంగ్లండ్ లో పర్య టిస్తున్న టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ కెళ్లి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారని పేర్కొంది. కాగా, వింబుల్డన్ మ్యాచ్లకు ధోనీ కుటుంబంతో హాజరైన విషయం తెలిసిందే.
