తన మార్క్ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసమే తపించే ఆయన.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేవారు. అప్పుడప్పుడూ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్, మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా విహారయాత్రలకూ వెళ్లేవారు.
ఇటీవల వైఎస్ జయంతి సందర్భంగా ఆయన తన కుటుంబంతో గడిపిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు యుక్తవయసులో, తండ్రి రాజారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో ఆయన ఉన్న ఫొటోలను కూడా అభిమానులు షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీకోసం..