హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని.. దీనికి యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మరో 4, 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఉందని.. ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దన్నారు.