అప్పట్లో తనపై శక్తివంతమైన వ్యవస్థలతో కాంగ్రెస్, టీడీపీ దాడి చేశాయని వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్నారు. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశాయని చెప్పారు. వైసీపీ ప్లీనరీ ముగింపు సందర్భంగా కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. మనకి అన్యాయం చేసిన పార్టీలకు రాష్ట్రంలో నామరూపాల్లేవన్నారు.
2014లో ఓడినా తనపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదని.. 23 మంది ఎమ్మెల్యేలు, 3 మంది ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే గొప్పగా రాస్తాడని.. మన దగ్గర కొన్న 23 ఎంపీలు, 3 ఎంపీ సీట్లే వాళ్లకు మిగిలాయని టీడీపీని ఉద్దేశించి అన్నారు. పార్టీని నడిపించేవి కేరక్టర్, క్రెడిబులిటీ మాత్రమేనన్నారు.
టీడీపీ పెత్తందార్ల పార్టీ అని.. ఆ పార్టీ సిద్ధాంతం వెన్నుపోటు మాత్రమేనన్నారు. రెండు సిద్ధాంతాలు, భావాలకు మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ చెప్పారు. ప్రజలకు మంచి చేసే చిప్ గుండెల్లో ఉండాలన్నారు. చంద్రబాబుకు పదవిపైనే వ్యామోహం ఉందని విమర్శించారు.