టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంది ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని దాదా చెప్పాడు. ఈ పరిస్థితులకు ఎవరినీ తప్పుపట్టలేమన్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విరామమివ్వక తప్పదన్నాడు. ప్రతి సిరీస్ కు కోచ్ ద్రవిడ్ పరిస్థితి చూస్తే బాధనిపిస్తుందన్నాడు.
