దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని అండిపట్టి పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది. అంతేకాకుండా 10 విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ పాఠశాలను మూసివేశారు. దీంతో పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది. కాగా నిన్న దేశవ్యాప్తంగా 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి.
