హైదరాబాద్ నగరవాసులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచే వర్షం పడుతోంది.
నగరంతో పాటు తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది.