కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్లు, బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సీనియర్ నాయకులు సుధాకర్ గారు ఎమ్మెల్యే గారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడారు. వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మురళి పాల్గొన్నారు.