పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా నిలిచింది. దీంతో కేటీఆర్ ఆ గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షిని అభినందించారు.