కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కి చెందిన కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీ ప్రైవేట్ భూముల్లో డిఫెన్స్ జోక్యంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నోటీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంజీవ రెడ్డి, కాలనీ వాసులు భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి, విజయ్ కుమార్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
