ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు.
ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, కానిస్టేబుల్ సందీప్, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.