తన పాలనలో అక్రమాలకు పాల్పడితే తానే నియంతలా మారతానని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు. అక్రమాలను ప్రోత్సహించనని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు.
తమిళనాడులోని నామక్కల్‌లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. మనకు నచ్చిందే చేయడం ప్రజాస్వామ్యం కాదని.. అలా తానెప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. ఈ వార్నింగ్ స్థానిక ప్రజాప్రతినిధులకే కాదని.. ప్రతి ఒక్కరికీ అని క్లారిటీ ఇచ్చారు స్టాలిన్.