తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ రోజు సాయంత్రం నాలుగంటలకు బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రాజభవన్, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గౌడ్స్ చుట్టుపక్కల రోడ్లపై ప్రయాణించడం మానుకోవాలని సూచించారు. టివోలీ చౌరస్తా నుంచి ప్లాజా చౌరస్తా వరకు రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు.
