నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. 1,663 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇంజినీరింగ్విభాగానికి చెందినవే 1,522 ఉన్నాయి. ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖల్లోని ఇంజినీరింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు.
ఇరిగేషన్లో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, 95 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 46, 998 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లయింది.