T20 ఫార్మాట్ లో ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146లతో మాత్రం టెస్ట్ క్రికెట్లో మాత్రం ధనాధన్ ఆటతీరును ప్రదర్శించాడు. బౌలర్ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్ బ్యాట్ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్ అద్వితీయంగా కోలుకుంది.అంతేకాకుండా రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్) తో కలిసి ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 222 పరుగులను అందించాడు. విదేశాల్లో ఈ వికెట్‌కు భారత్‌కిదే అత్యుత్తమం. గతంలోనూ సచిన్-అజరుద్దీన్ జోడీ ఇన్నే పరుగులు అందించింది. దీంతో ఐదో టెస్టులో తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. అండర్సన్‌కు మూడు, పాట్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. క్రీజులో జడ్డూతో కలిసి షమి పరుగులేమీ చేయకుండా ఉన్నాడు.
స్కోరుబోర్డు
భారత్:
గిల్ (సి) క్రాలే (బి) అండర్సన్ 17, పుజార (సి) క్రాలే (బి) అండర్సన్ 13, విహారి (ఎల్బీ) పాట్స్ 20, కోహ్లీ (బి) పాట్స్ 11, పంత్ (సి) క్రాలే (బి) రూట్ 146, అయ్యర్ (సి) బిల్లింగ్స్ (బి) అండర్సన్ 15, జడేజా (బ్యాటింగ్) 83, శార్దూల్ (సి) బిల్లింగ్స్ (బి) స్టోక్స్ 1, షమి (బ్యాటింగ్) 0, ఎక్స్‌ట్రాలు 32, మొత్తం 73 ఓవర్లలో 338/7 వికెట్లపతనం: 1/27, 2/46, 3/64, 4/71, 5/98, 6/320, 7/323 బౌలింగ్: అండర్సన్ 19-4-52-3, బ్రాడ్ 15-2-53-0, మాథ్యూ పాట్స్ 17-1-85-2, లీచ్ 9-0-71-0, స్టోక్స్ 10-0-34-1, రూట్ 3-0-23-1