చట్టవిరుద్ధంగా తనను అరెస్టు చేసిన పోలీసులు, జైల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరాఠీ నటి కేతకి చితాలే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కించపరిచేలా ఉన్న పద్యా న్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న ఆరోపణలపై కేతకిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 14న అరెస్టు చేయగా.. గత నెల 22న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. జైల్లో పోలీసులు తనను కొట్టారని, లైంగిక దాడి చేశారని, హింసించారని కేతకి ఆరోపించారు.
