తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ రోజు నుండి జరగనున్న కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అయిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల హోర్డింగులు షాక్ ఇస్తున్నాయి.
తమ రాష్ర్టాల్లో ఎక్కడైనా తెలంగాణ పథకాలు ఉన్నాయా! అని ఆలోచించుకొనేలా ఉన్నాయి. స్వాగతం చెప్పినట్టే కనిపిస్తున్న ఆ హోర్డింగులు నిజానికి వ్యంగ్యంగా, ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకులకు చెంపపెట్టులా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఎనిమిదేండ్లలో ఎలా పురోగమించిందో, వివిధ రంగాల్లో ఎలా దూసుకొని వెళ్తున్నదో.. ఇంగ్లిష్లో ఏర్పాటుచేసిన హోర్డింగులు వివరిస్తున్నాయి.