మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పడిపోయిన రోజే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు వచ్చాయి. నిన్న రాత్రి తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాకో లవ్ లెటర్ అందింది. 2004, 09, 14, 20 ఎన్నికల్లో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ నుంచి ప్రేమ లేఖ వచ్చింది’ అని తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై ఐటీని ప్రయోగిస్తున్నారని పవార్ ఈ సందర్భంగా విమర్శించారు.