మహారాష్ట్ర రాజకీయాల్లో సూపర్ ట్విస్ట్. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారని అంతా భావించారు. కానీ ‘మహా’ రాజకీయం కీలక మలుపు తీసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఫడ్నవీస్ అనూహ్య ప్రకటన చేశారు.
ముంబయిలో గవర్నర్ కోష్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే కోరారు. అనంతరం ఆ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. బీజేపీ మద్దతుతో శిందే సీఎం పీఠాన్ని ఎక్కనున్నారు. ఈ రాత్రికే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.