తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గురుకులకు చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రయివేటు స్కూళ్లను దాటేసి విజయఢంకా మోగించారు. మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి మొదటి వరుసలో నిలిచారు. ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు అత్యధికంగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 75.68 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత సాధించారు.
ఆయా పాఠశాలల ఉత్తీర్ణత శాతం వివరాలివే..
ఎస్సీ గురుకులాలు – 98.1 శాతం ఉత్తీర్ణత
బీసీ గురుకులాలు – 97.47 శాతం ఉత్తీర్ణత
ఎస్టీ గురుకులాలు – 95.3 శాతం ఉత్తీర్ణత
మోడల్ స్కూల్స్ – 97.25 శాతం ఉత్తీర్ణత
మైనార్టీ రెసిడెన్సియల్స్ – 93.73 శాతం ఉత్తీర్ణత
కేజీబీవీ స్కూల్స్ – 93.49 శాతం ఉత్తీర్ణత
ప్రైవేట్ పాఠశాలలు – 91.31 శాతం ఉత్తీర్ణత
జిల్లా పరిషత్ హైస్కూల్స్ – 80.73 శాతం ఉత్తీర్ణత
ప్రభుత్వ పాఠశాలలు – 75.65 శాతం ఉత్తీర్ణత