రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలో ఉన్న అభిమాని కుటుంబ సభ్యులతో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడారు. జనార్ధన్ అనే యువకుడు కోమాలో ఉన్న విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకున్న తారక్.. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
జనార్దన్కు ఏం కాదని.. కుటుంబసభ్యులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. అందరం కలిసి దేవుడ్ని ప్రార్థిద్దామన్నారు. నేనున్నానంటూ ఎన్టీఆర్ భరోసానిచ్చారు. ఆ తర్వాత జనార్దన్ వద్దకు ఫోన్ తీసుకెళ్లమని చెప్పిన తారక్.. జనార్దన్తో మాట్లాడి అతడిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అభిమాని వైద్యఖర్చుల కోసం ఎన్టీఆర్ కొంత ఆర్థికసాయం కూడా అందించినట్లు తెలుస్తోంది.