తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల బుధవారం చెక్ రిపబ్లిక్‌లో ఎన్నారైలతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఇది టీఆర్‌ఎస్ పార్టీకి 52 వ ఎన్నారై శాఖ అని పేర్కొన్నారు.మిగతా యూరప్ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష స్పందన లభించిందన్నారు. ఏ ఎన్నారైని అడిగినా కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారని ఆయన తెలిపారు మోదీ పాలనలో దేశాన్ని బ్రష్టు పట్టించారన్నారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ పడిపోయిందన్నారు.