ఏపీ అధికార పార్టీ అయిన వైఎస్సార్ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వచ్చే నెలలో రాష్ట్రంలోని మంగళగిరిలో జరుపనున్నారు. జులై 8,9వ తేదీన వైసీపీ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మంగళగిరిలో ఆ పార్టీ నేతలు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓడించి.. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు వైసీపీకి మరోసారి అవకాశమివ్వండి అనే నినాదంతో ప్లీనరి సమావేశం నిర్వహించుకోనున్నామని తెలిపారు .