ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శ్రీశైలంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలే తమకు ఓటు వేస్తారని అన్నారు. ‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’ అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అదే స్థాయిలో రిప్లై ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.
