మహారాష్ట్రలో మొత్తం 287 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అధికారం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 144 స్థానాలు కావాలి. సీఎం ఉద్దవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి 120 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన రెబల్ వర్గం నేత షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనుండగా షిండే వర్గానికి 167 మంది ఎమ్మెల్యే లు అవుతారు. మరి రేపు జరిగే బల పరీక్షలో ఎవరు ఎటువైపు జంప్ అవుతారో చూడాలి.
