అర్హులైన లబ్ధిదారులందరికీ ‘రైతుబంధు’ కింద ఆర్థికసాయం జమ చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ఎక్కువ భూమి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందనేది అవాస్తమని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు.
రైతుబంధుపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదో విడత రైతుబంధు కింద రూ.7,508కోట్లు అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఈ రెండు రోజుల్లో ఎకరా, రెండు ఎకరాలు ఉన్న వారికి రూ. 1820.75 కోట్లు జమ చేశామన్నారు. 10 ఎకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు అందిస్తుందని రూ. 250 కోట్లు మాత్రమే అని నిరంజన్‌రెడ్డి తెలిపారు.