తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అలనాటి స్టార్ హీరోయిన్ … సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
నటి మీనా భర్త విద్యాసాగర్ కొన్నేండ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ఆ సమయంలో కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. విద్యాసాగర్ అనారోగ్యం క్షీణించింది.
ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో ఊపిరితిత్తుల మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అప్పటి నుంచి ఎంజీఎం ఆస్పత్రితో చికిత్స తీసుకుంటున్నారు. అయితే సరైన సమయానికి విద్యాసాగర్‌కు సరిపోయే ఊపిరితిత్తులు దొరకలేదు. దీంతో లంగ్స్ ట్రాన్స్ప్లంటేషన్ కుదరలేదు. ఈ క్రమంలో రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించిన విద్యాసాగర్ బుధవారం తుదిశ్వాస విడిచారు.