తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ రోజు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా విడుదలయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఫలితాలను విడుదల చేశారు.
. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని మూడు ప్రభుత్వ వెబ్‌సైట్లలతో పాటు ‘నమస్తే తెలంగాణ’ www.ntnews.com వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.inతోపాటు వీటిలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్ షీట్‌ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.