తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఫలితాల్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 63.32%, సెకండియర్లో 67.82% ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.అయితే మొదటి సంవత్సరంలో 2,33,210 మంది అమ్మాయిలు రాస్తే 1,68,692 మంది (72.33%) పాసయ్యారు.
అదే 2,31,682 మంది అబ్బాయిలు రాస్తే 1,20,686 మంది (54.20%) పాసయ్యారు. మరోవైపు రెండో సంవత్సరంలో 2,16,329 మంది అమ్మాయిలు రాస్తే 1,64,172 మంది (75.86%)పాసయ్యారు. 2,19,981 మంది అబ్బాయిలు రాస్తే 1,31,777 మంది (60%) పాసయ్యారు.