ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్థ సెల్ టు ప్యాక్ (సీటీపీ) థర్డ్ జెనరేషన్ సాంకేతికతతో ‘క్విలిన్’ పేరిట ఈ బ్యాటరీని రూపొందించింది.
2023 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నడిచే బ్యాటరీ ఇదేనని చెబుతున్నారు. ఈ బ్యాటరీల ఎక్కువ కాలం మన్నడమే కాకుండా, భద్రత విషయంలో కూడా చాలా బాగుంటుందని చెబుతున్నారు. పైగా చార్జింగ్ చాలా వేగంగా అవుతుందని పేర్కొంటున్నారు.