ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం (జూన్ 25న) నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది.గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ పాల్గొంటాడా లేదా అనే విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేయలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్నది. ప్రస్తుతం టీమిండియా లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే.
