ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్‌మాస్టర్ మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి.
దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే టీచర్లంతా ఆస్తుల వివరాలను వెల్లడించేలా చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసింది. ఈ పరిణమాల నేపథ్యంలో విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీచర్లపై కక్షపూరితంగానే ప్రభుత్వం ఇదంతా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.